Scroll Top
ఇండియన్ CEOపై విరుచుకుపడ్డ అమెరికన్ జర్నలిస్ట్, కఠిన వ్యాఖ్యల కారణంగా తొలగింపు

అమెరికన్ మీడియా సంస్థ ది బ్లేజ్ జర్నలిస్ట్ మ్యాట్ ఫోర్నీని, భారతీయులపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యల కారణంగా ఉద్యోగం నుండి తొలగించింది. భారతీయ మూలాలున్న Etsy CEO కృతి పటేల్ గోయల్‌ను “అనర్హురాలు” అని, “ప్రతి భారతీయుడిని అమెరికా నుంచి డిపోర్ట్ చేయాలి” అని ఫోర్నీ చేసిన పోస్ట్‌లు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. తన తొలగింపును ఫోర్నీ స్వయంగా X‌లో ప్రకటించాడు. గతంలో కూడా భారత్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసిన అతనిపై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ ఘటన అమెరికాలో వలసదారులపై ద్వేషపూరిత ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉందని సూచిస్తోంది.

Related Posts
Clear Filters