చెన్నైలో జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 8, 2025న ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించింది. అపోలో ఆసుపత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, నేత్ర వైద్యం వంటి విభాగాల్లో నిపుణుల సేవలు అందించబడ్డాయి.
ఆరోగ్య మంత్రి మా. సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ, ECG, ఎకో, అల్ట్రాసౌండ్ వంటి ఆధునిక సౌకర్యాలు శిబిరంలో ఉన్నాయని, భారతీయ వైద్యం విభాగాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన జర్నలిస్టులకు సమగ్ర ఆరోగ్య బీమా ఇప్పటికే అమల్లోకి వచ్చింద, 1,414 మంది జాబితాలో చేరినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పెన్షన్ను ₹10,000 నుంచి ₹12,000కు, సంక్షేమ సహాయాన్ని ₹3 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచినట్లు చెప్పారు.
రాష్ట్ర అత్యవసర వైద్య సేవలను మెరుగుపర్చడానికి తయారైన TAEI Registry 2.0 యాప్ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎం.పి. సామినాథన్, మేయర్ ఆర్. ప్రియా తదితరులు పాల్గొన్నారు.