Scroll Top
bma_d843b3c56ffd6d44a9c708fa0e1e2ea6

మన జైలుశిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?

మనమంతా జైలు అనగానే తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించే స్థలం అనుకుంటాం. కానీ, నిజానికి అక్కడ చాలామంది అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు. ఇది మన దేశానికి, మన న్యాయవ్యవస్థకు ఒక పెద్ద మచ్చ.

మీకు తెలుసా? మన జైళ్లలో దాదాపు 76% మంది ఇంకా నేరం నిరూపించబడని వాళ్లే. వాళ్లు కేవలం విచారణ కోసం మాత్రమే లోపల ఉన్నారు. వాళ్లు తప్పు చేశారో లేదో తెలియకముందే వాళ్ల జీవితాలు జైల్లో గడిచిపోతున్నాయి.

ఒక ఆర్మీ మేజర్ లాంటి గొప్ప అధికారి కూడా ఐదేళ్లు చేయని నేరానికి జైల్లో ఉన్నాడు. చివరికి నిర్దోషి అని తేలింది. కానీ, ఐదేళ్ల కాలాన్ని ఎవరు తిరిగి ఇవ్వగలరు? అదీ కాకుండా, బీహార్లో ఒక పేదవాడు ఏకంగా 40 ఏళ్లు జైల్లో గడిపాడు. అతని యవ్వనం, కలలు అన్నీ జైలు గోడల మధ్యే సమాధి అయ్యాయి.

దీనికి ఎవరు సమాధానం చెప్పాలి?

మన ఎగ్జిక్యూటివ్ సిస్టమ్నా,

మన జుడీషియరీ సిస్టమ్నా,

లేక మన రాజ్యాంగమా?

  మన దగ్గర కేసుల విచారణ చాలా నెమ్మదిగా జరుగుతుంది. న్యాయం వాయిదా పడితే, అది అన్యాయమే అవుతుంది.  మన జైళ్లలో ఖైదీల సంఖ్య చాలా ఎక్కువ. ఒకరికి ఉండే చోట నలుగురు ఉం టున్నారు.

  పేదవాళ్లు బెయిల్ కోసం డబ్బు కట్టలేక జైల్లోనే ఉండిపోతున్నారు. వాళ్లకు న్యాయ సహాయం కూడా అందడం లేదు.

పరిస్థితి మారాలంటే మనం మేల్కోవాలి. అన్యాయంపై గట్టిగా మాట్లాడాలి. ప్రతి ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా మన వ్యవస్థలను సరిచేసుకోవాలి. మనం నిశ్శబ్దంగా ఉంటే, రేపు అన్యాయం మన కుటుంబాలకూ జరగవచ్చు. కనుక, గళం విప్పాలి. మన గళం అమాయకుల జీవితాలకు ఆశను నింపాలి.

జైలు అంటే కేవలం నేరస్థులకేనా? లేక అమాయకులను బలితీసుకునే ప్రదేశమా? దీనిపై మీ ఆలోచనలు ఏంటో తెలియజేయగలరు. Jai Hind

Related Posts

Leave a comment