Skip to main content Scroll Top
తెలంగాణ & ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్!

175 నుంచి 225కు పెంపునకు మార్గం సుగమం
119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది. దేశంలో జన గణన చేపట్టడానికి అనుమతిస్తూ సోమవారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనగణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్వి భజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. రాజ్యాంగంలోని 170వ అధికర ణలోని సెక్షన్-15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్ర ప్రదేశ్లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టా లని విభజన చట్టం-2014లో సెక్షన్-26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది

Related Posts
Clear Filters