Scroll Top

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం

Clear Filters

ఆంధ్ర ప్రదేశ్‌ – నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు అధికారులు వరద నియంత్రణ చర్యల్లో భాగంగా ఎనిమిది క్రష్ గేట్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టుకు 65,845 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,20,952 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. నీటిమట్టం పూర్తిస్థాయి అయిన 590 అడుగులకు చేరింది.

అధికారులు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరాన్ని బట్టి నీటి విడుదల కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Post By Bharataawaz

Related Posts
Clear Filters