Scroll Top
bma_7dc81587122fbd159e388573b342803c

హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఈ నిరసన చేపట్టారు.

నిన్న నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికులను మూడు కేటగిరీలుగా విభజించి జీతాలు పెంచుతామని నిర్మాతలు ప్రతిపాదించగా, కార్మికులు దానిని తిరస్కరించారు. దీంతో సమస్య మళ్ళీ మొదలైంది.

తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సినీ కార్మికులు హెచ్చరించారు.