Scroll Top
మహిళా జర్నలిస్టుల హక్కులకు న్యాయాసనం తాళం తీసింది: సుప్రీం కోర్ట్ బ్రేక్‌త్రూ ఆర్డర్

తెలంగాణలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్టు దేశవ్యాప్తంగా చర్చను రేపిన సందర్భంగా, సుప్రీం కోర్టు వారికి కీలక ఉపశమనాన్ని అందించింది. పల్్స్ న్యూస్ చీఫ్ పోగడదండ రేవతి మరియు రిపోర్టర్ తమ్వీ యాదవ్  మార్చి 12న అరెస్టై, ఐదు రోజులకు బెయిల్‌పై విడుదలైన ఈ ఇద్దరిపై మళ్లీ అరెస్టు చర్యలను సుప్రీం కోర్టు గురువారం నిలిపివేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అవమానకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తమ్వీ ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ కావడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆ వీడియోను రేవతి సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది మరింత ప్రాచుర్యం పొందింది. తరువాత కాంగ్రెస్ సోషల్ మీడియా యూనిట్ ఫిర్యాదు చేయడంతో అశ్లీల కంటెంట్ ప్రచురణ, అపకీర్తి, కుట్ర, శాంతిభంగానికి ప్రేరేపణ వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యాయి.

హైకోర్టు రీ-అరెస్టును సమర్థించడంతో, ఇద్దరూ అత్యవసరంగా సుప్రీం కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం వెంటనే స్టే విధించింది.

ఈ తీర్పు జర్నలిస్టుల హక్కులకు రక్షణగా, అభివ్యక్తి స్వేచ్ఛకు బలమిచ్చింది.

Related Posts
Clear Filters