నిజం చెప్పే మహిళా జర్నలిస్టులు రోజూ ఆన్లైన్లో తీవ్ర వేధింపులు, ట్రోలింగ్, బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. లైంగికంగా అవమానించే కామెంట్లు, డీప్ఫేక్లు, హేట్ క్యాంపెయిన్లు ఇవి వారి ధైర్యాన్ని పరీక్షిస్తున్నాయి.
అయినా వారు వెనక్కి తగ్గడం లేదు.
ఎందుకంటే వారిని నడిపేది భయం కాదు నిజం పట్ల ఉన్న బాధ్యత.
డిజిటల్ హింస ఎంత పెరిగినా, వారు నిలబడిన ప్రతి మాట ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ.
వారి స్వరం ఒక సందేశం:
“నిజాన్ని చెప్పే స్వరాన్ని ఎవరూ ఆపలేరు.”