Skip to main content Scroll Top
ఒంగోలులో మీడియా భగ్గుమన్నది: హక్కుల కోసం రోడ్లెక్కిన జర్నలిస్టులు

ఒంగోలులో జర్నలిస్టులు శుక్రవారం ప్ర‌కాశం భ‌వ‌న్ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (APUWJ) ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు పాల్గొన్న ఈ నిరసనలో, ప్రభుత్వం మాట స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విమర్శనాత్మక వార్తలు ప్రచురించిందని ఒక తెలుగు దినపత్రికపై కేసు నమోదు చేసి, దాని ఎడిటర్‌ను పదే పదే విచారణ పేరుతో వేధించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. “ప్రభుత్వం విమర్శలను స్వీకరించకుండా జర్నలిస్టులను అణగదొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు” అని రాష్ట్ర కార్యదర్శి సురేష్ పేర్కొన్నారు. అనంతరం ఆందోళనకారులు జిల్లా రెవెన్యూ అధికారి ఒబులేసు, డీఎస్పీ శ్రీనివాసులకు వినతిపత్రం సమర్పించారు.

Related Posts
Clear Filters