Skip to main content Scroll Top
“డిజిపబ్ రెడ్ ఫ్లాగ్ ఎగురవేసింది: డేటా నిబంధనలు స్వతంత్ర జర్నలిజానికి తీవ్రమైన ముప్పు”

కొత్త డేటా నిబంధనలు RTI వ్యవస్థను బలహీనపరచి, జర్నలిజం స్వేచ్ఛను ప్రమాదంలోకి నెడుతున్నాయని DIGIPUB తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.“సత్యాన్ని వెలికి తీయడానికి ఉన్న శక్తివంతమైన సాధనాన్ని దెబ్బతీయొద్దు” అని వారు హెచ్చరించారు.

RTI అంటే ప్రజల హక్కు, ప్రభుత్వంపై ప్రశ్నించే శక్తి, నిజాలను బయటపెట్టే ప్రజాస్వామ్య సాధనం.
నియమాలు అమల్లోకి వస్తే పారదర్శకత తగ్గి, సమాచారం అందుబాటులోకి రావడం కష్టమవుతుందని DIGIPUB అంటోంది.

“RTI బలహీనపడితే జర్నలిజం బలహీనపడుతుంది; అప్పుడు ప్రజాస్వామ్యం కూడా దెబ్బతింటుంది” అని స్పష్టం చేసింది.ప్రజలకు నిజమైన సమాచారం అందాలంటే RTI బలంగా ఉండాలని, డేటా నిబంధనల్లో తక్షణ సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

Related Posts
Clear Filters