మహిళలపై తీవ్రమైన ఆంక్షలు అమలు చేస్తున్న తాలిబాన్ పాలన మధ్య, ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆఫ్ఘాన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో భారత మహిళా జర్నలిస్టులను ముందరి వరుసలో కూర్చోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇది రెండు రోజుల క్రితం జరిగిన వివాదానికి ప్రతిస్పందనగా వచ్చింది. శుక్రవారం జరిగిన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విమర్శల తరువాత ముత్తాఖీ దీనిని “టెక్నికల్ లోపం”గా పేర్కొన్నప్పటికీ, చాలా మందికి అది నమ్మశక్యం కాలేదు.
ఈ ఘటనపై రాజకీయ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆదివారం వెలుగులోకి వచ్చిన ఆ ఫోటో ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది
భారత మహిళా మీడియా ధైర్యం ముందు ఎలాంటి ఆంక్షలు నిలవవు. ప్రెస్ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరు. మహిళల స్వరం ఎప్పుడూ మౌనమయ్యేది కాదు.