కదిరి : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం కరాటే బెల్ట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు. మహిరా షోటోఖాన్ కరాటే డో ఇండియా, యునైటెడ్ షోటోఖాన్ కరాటే డో ఇండియా శ్రీ సత్యసాయి జిల్లా స్టైల్ చీఫ్, 5వ డాన్ బ్లాక్ బెల్ట్ మాస్టర్ షాకీర్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి.విద్యార్థులకు వారిలోని కరాటే నైపుణ్యాలను పరీక్షించేందుకు వార్మప్స్, సిట్అప్స్, పంచెస్, బ్లాక్స్, కిక్స్, స్టాండ్స్, కటాస్, కుమితే తదితర అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష అనంతరం కరాటే ద్వారా ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందుతాయని మాస్టర్ షాకీర్ విద్యార్థులకు వివరించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కరాటే బెల్ట్ టెస్ట్‌లో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
Clear Filters
-
September 25, 2026
-
September 24, 2026
Related Posts
Clear Filters
తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
భారీ వర్షాలతో పెరిగిన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టి రైతుల పంటలకు అందించాలి – ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు
భారీ వర్షాలతో పెరిగిన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టి రైతుల పంటలకు అందించాలి – ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు
🚨 _అమరావతి: ఏపీలో మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు – ప్రభుత్వం కీలక నిర్ణయం!_ 🚨
🚨 _అమరావతి: ఏపీలో మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు – ప్రభుత్వం కీలక నిర్ణయం!_ 🚨
ఆధార్, రేషన్ కార్డ్ ఉంటే చాలు అనుకున్నారా? AP Residence Certificate కొత్త రూల్స్ ఇవే
ఆధార్, రేషన్ కార్డ్ ఉంటే చాలు అనుకున్నారా? AP Residence Certificate కొత్త రూల్స్ ఇవే