Scroll Top
bma_220c6ea49322e21e61ea26a17caf72d8

జూన్ 25, 1975 – భారత ప్రజాస్వామ్య చరిత్రలో నల్ల రోజుగా గుర్తింపు పొందిన రోజు.
ఆ రోజు ప్రకటించిన ఎమర్జెన్సీతో ప్రజల హక్కులు, ప్రెస్ స్వేచ్ఛలు మూసివేయబడ్డాయి.
పత్రికలపై కంచె వేసారు. వేలాది మందిని అరెస్ట్ చేశారు. ప్రశ్న అడిగే గొంతును అణచేశారు.

ఇప్పటివరకు మారిందేమైనా?

ఇప్పుడు ఎమర్జెన్సీ అధికారికంగా లేదు. కానీ స్వేచ్ఛ ఉందా? లేక అది కొత్తరూపంలో ఉందా?

ఈరోజుల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నవివరణలు:

  • ఆన్లైన్ బెదిరింపులు, ట్రోలింగ్

  • చట్టాల వాడకం ద్వారా అరెస్టులు

  • పత్రికలకు ఆర్ధిక ఒత్తిడులు

  • రాజకీయం నుంచి బ్లాక్‌లిస్ట్

  • డిజిటల్ నిఘా – ఎవరైనా చూస్తున్నారు అన్న అనుమానం

ఇది ఒక నవీన నియంత్రణ విధానం — మౌనంగా, చట్టబద్ధంగా, కానీ ప్రమాదకరంగా.

ఇప్పుడు మన స్థితి?

2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత్ ర్యాంక్ – 159/180 దేశాలు
జర్నలిస్టులు అరెస్టు అవుతున్నారు, కేసులు వేయబడుతున్నాయి, మరికొందరిపై దాడులు జరుగుతున్నాయి.

నిజంగా మనం స్వేచ్ఛగా ఉన్నామా?

సెన్సార్ లేకపోవడమే స్వేచ్ఛ కాదు.
నిజాన్ని చెప్పగల ధైర్యం ఉండడమే స్వేచ్ఛ.
అది కలిసొచ్చే గౌరవం కావాలి – భయాన్ని కాదు.

ఎందుకు ఇది ముఖ్యం?

పత్రికా స్వేచ్ఛ లేని ప్రజాస్వామ్యం – వెన్నెముకలేని శరీరం లాంటిది.
బతికినట్టు కనిపిస్తుంది కానీ నిలబడలేను.

మళ్ళీ ఎమర్జెన్సీ వచ్చాకే గుర్తు చేసుకోవాలా?
లేదా ఇప్పుడే మనం నిజమైన స్వేచ్ఛ కోసం నిలబడాలా?

Related Posts

Leave a comment