కదిరి, సెప్టెంబర్ 10: శ్రీ సత్యసాయి జిల్లా బహుజన ఉద్యోగుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న ధర్మవరంలో నిర్వహించనున్న “బహుజన ఉద్యోగుల న్యాయభేరి – చలో ధర్మవరం” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని కదిరి R&B అతిథి గృహంలో విడుదల చేశారు. రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి నచ్చు బాలకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు, న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ ఉద్యోగ చట్టం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కాంట్రాక్ట్–అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత తదితర డిమాండ్లపై సభలో చర్చించనున్నట్లు తెలిపారు. బహుజనులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి సుదర్శన్, జి.రాజశేఖర్, కటారి రెడ్డి యాదవ్, పామిడి శంకర్ యాదవ్, రజక సంఘం శీనా, జి.గంగాధర్ యాదవ్, పట్ర రామాంజనేయులు, చేనేత వెంకటరమణ, వడ్డెర గంగన్న, బెస్త రమణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కదిరిలో కరపత్రం విడుదల
Clear Filters
Related Posts
Clear Filters
కదిరి మున్సిపల్ కమిషనర్‌కు జనసేన నాయకుల వినతి
కదిరి మున్సిపల్ కమిషనర్‌కు జనసేన నాయకుల వినతి
గుట్టకిందపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలని మంత్రికి వినతి
గుట్టకిందపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలని మంత్రికి వినతి
📰 కదిరిలో ఘనంగా నిజం గెలిచింది కార్యక్రమం
📰 కదిరిలో ఘనంగా నిజం గెలిచింది కార్యక్రమం
గాండ్లపెంటలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
గాండ్లపెంటలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ