3 EMI లు కట్టినా, 4వ EMI ఆలస్యమైందని బూతులు తిట్టి బెదిరింపులు
హైదరాబాద్: చోళా ఫైనాన్స్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న *సాలండ్రి శ్రీనివాస్* అనే వ్యక్తి ఓ మహిళా కస్టమర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు *మాచ పూజిత* స్కూటీ కోసం చోళా ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 3 EMI లను క్రమం తప్పకుండా చెల్లించారు.
అయితే అనారోగ్యం కారణంగా 4వ EMI కట్టలేకపోయానని, వచ్చే నెలలో కలిపి కడతానని పూజిత కోరగా, సదరు ఉద్యోగి సాలండ్రి శ్రీనివాస్ నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు.
“ఒక EMI కి Cash పెడతాను, లీగల్ వాళ్ళని తీసుకొని వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మాచ పూజిత వాపోయారు.
RBI నిబంధనల ప్రకారం రికవరీ ఏజెంట్లు ఇలా బెదిరించడం, బూతులు తిట్టడం నిషేధం.