🔹కూటమి విజయమే లక్ష్యం.. నాయకులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం..!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వింజమూరు మండలం బొమ్మరాజుచెరువు లోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో కొండాపురం మండల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటుచేసుకున్న దౌర్జన్యాలు, ప్రజలకు జరిగిన అన్యాయాలు, పాలనలోని వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయడంతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలను ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటికీ చేరవేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల మద్దతుతో స్థానిక సంస్థల్లో కూటమి బలాన్ని మరింత పెంచుకోవాలంటే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు పిలుపునిచ్చారు.