జమ్మూలో అధికారుల కూల్చివేత చర్యల కారణంగా ఇల్లు కోల్పోయిన ముస్లిం జర్నలిస్టుకు ఊహించని రూపంలో మానవత్వం అండగా నిలిచింది. తన కుటుంబంతో కలిసి వీధిలో నిలిచి పోయిన ఆ జర్నలిస్టుకు, అతని హిందూ పొరుగువాడు ముందుకు వచ్చి తన భూమిని బహూకరించడం హృదయాన్ని కదిలించే సంఘటనే కాక, మన దేశపు సమైక్యత, సోదరభావం ఎంత బలంగా ఉందో చూపించింది.
హౌస్ డెమాలిషన్ తర్వాత ఆ జర్నలిస్టు ఎదుర్కొన్న అన్యాయం దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తుండగా, ఈ హిందూ పొరుగువారి ఉదారత అందరికీ కొత్త ఆశ చూపింది. మతాలు, వర్ణాలు, భేదాలు అంతా పక్కన పెట్టి ఒక కుటుంబం కష్టాల్లో ఉందని భావించి ముందుకు రావడం, మానవత్వం ఎప్పటికీ బ్రతికే ఉందనే సందేశాన్ని గట్టిగా ఇస్తోంది.
కూల్చివేత దెబ్బతో కుంగిపోయిన కుటుంబానికి ఈ భూమి బహూకరణ కేవలం సహాయం మాత్రమే కాదు
“మన దేశం విభజన కంటే ఐక్యత మీదే నిలబడింది” అనేది మళ్లీ గుర్తు చేసిన ఉదాత్తమైన చర్య.
సామాజిక ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ కాలంలో, సాధారణ ప్రజల నుంచి వచ్చిన ఈ మహోన్నత నిస్వార్థం భారతీయ సమాజం యొక్క అసలు శక్తిని ప్రపంచానికి చూపిస్తోంది.